దారుణం..బీర్ల కోసం యువకుని దారుణ హత్య..కత్తితో పొడిచి..


 Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బీర్లు ఇవ్వలేదని సాయి వరప్రసాద్ అనే వ్యక్తిని నలుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మీర్ పేటకు చెందిన సాయివరప్రసాద్ కొన్ని బీర్లు తీసుకొని జిల్లెల్లగూడకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొంతమంది యువకులు సాయిని అడ్డుకున్నారు. తన దగ్గర ఉన్న బీర్లు ఇవ్వమని డిమాండ్ చేశారు. దీనితో సాయి బీర్లు ఇవ్వనని పట్టుపట్టడంతో యువకులు కత్తితో పొడిచారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.


హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుల గురించి ఆరా తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు గల కారణాల గురించి పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అసలు బీర్ల కోసమే ఈ హత్య చేశారా? లేక పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? అని దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా హైదరాబాద్

అభివృధ్ది చెందుతున్న నగరం. కానీ రాజధానిలో క్రైమ్ రేట్ పెరగడం కలకలం రేపుతోంది. హత్యలు, ఆత్మహత్యలు, యాక్సిడెంట్లు నిత్యకృత్యంగా మారడం నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక మద్యం కూడా నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. కేవలం బీర్లు ఇవ్వలేదనే నెపంతో యువకుడిని పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటన బాధిత కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. పోస్టుమార్టం అనంతరం యువకుని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.